ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:07 AM

హనుమకొండ, హంటర్ రోడ్డు వినాయక నగర్ రోడ్డు1 దుర్గాదేవి కాలనీలో ఓ కుటుంబానికి చెందిన 500 గజాల స్థలం ఆక్రమణకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో స్థల యజమానులు ఫిర్యాదు చేశారు.

హనుమకొండ: భూ కబ్జా వివాదంలో మహబూబాబాద్ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై కేసు నమోదైంది. మహబూబాబాద్‌లో ఓ స్థలాన్ని ఆక్రమించుకోవడంతోపాటు స్థల యజమానులపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్నారనే ఆరోపణలు శంకర్ నాయక్‌పై వచ్చాయి. దీనిపై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో స్థల యజమానులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆయనపై భూ వివాద ఆరోపణలు ఉన్నాయి. మహబూబాబాద్ చుట్టుపక్కల్లోకాకుండా వరంగల్ శివారులో కూడా ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితులు కూడా ఫిర్యాదులు చేశారు.


తాజాగా హనుమకొండ, హంటర్ రోడ్డు వినాయక నగర్ రోడ్డు1 దుర్గాదేవి కాలనీలో ఓ కుటుంబానికి చెందిన 500 గజాల స్థలం ఆక్రమణకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థల యజమానులకు చెందిన కంటైనర్‌తో పాటు గృహపకరణ వస్తువులను ఎత్తుకుపోయిన విషయంలో శంకర్ నాయక్‌పై పలు సెక్షన్‌లలో కేసు నమోదైంది. బాధితులపై దాడి చేసి, సెల్ ఫోన్లు లాక్కున్నారని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై ఆరోపణలు వచ్చాయి. వీటిపై పోలీసులు దృష్టి సారించారు. బాధితులు వరుసగా ఫిర్యాదు చేస్తుండటంతో పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు వేడుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్షేమం..అభివృద్ధి .. ఏపీకి మహర్దశ

ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన మహాదర్నా వాయిదా

ఐటీకి మరింత ఊతం: సీఎం చంద్రబాబు

జనంలోకి మనం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 21 , 2024 | 11:07 AM