పోలవరంపై చంద్రబాబు కీలక నిర్ణయం..
ABN, Publish Date - Jul 26 , 2024 | 09:10 AM
అమరావతి: పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ఓ కొలిక్కి తీసుకువస్తే.. అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్లలో పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును వినియోగంలోని తీసుకురావాలని, ఇది తన ఆకాంక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ఓ కొలిక్కి తీసుకువస్తే.. అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్లలో పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును వినియోగంలోని తీసుకురావాలని, ఇది తన ఆకాంక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రం కూడా పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని, కావాల్సిన నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావడానికి రెండు సీజన్ల సమయం పడుతుందని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయకపోగా.. నాశనం చేసిందని.. దరిమిలా రూ.30 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపే నిమిత్తం గురువారం సాయంత్రం అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. పోలవరం పూర్తిచేసే బాధ్యతను కేంద్రం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
‘ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే 960 మెగావాట్ల జల విద్యుత్కేంద్రం ఉత్పత్తిలోకి వచ్చేది. అది అందుబాటులోకి రాకపోవడం వల్ల చాలా ఎక్కువ ధరకు బయట నుంచి కరెంటు కొనాల్సి వస్తోంది. పంటలకు కూడా ప్రాజెక్టు నీరు అందుబాటులోకి రాలేదు. ఇవన్నీ లెక్కవేస్తే నష్టం రూ.30 వేల కోట్ల వరకు తేలుతోంది’ అని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరు.. మలిదశలో 45.72 మీటర్ల కాంటూరులో నిర్మాణాలంటూ సందేహాలకు తావివ్వకుండా.. గరిష్ఠ నీటి నిల్వ 196.40 టీఎంసీ మేర ప్రాజెక్టు నిర్మాణం సాగాలని.. ఆ మేరకు కేంద్రం సహకరించి నిధులివ్వాల్సిందిగా కోరదామని చెప్పారు. ‘కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని కేంద్ర జల సంఘం చైర్మన్ కుశ్వీందర్ వోహ్రా తీసుకున్న నిర్ణయం మేరకు.. కేంద్రం స్పందించి.. సకాలంలో ఆదేశాలు జారీ చేయాలి. కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే.. ఈ ఏడాది నవంబరు నుంచే పనులు ప్రారంభించే వీలుంటుంది’ అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
కుప్పంలో చేరికలను వ్యతిరేకిస్తున్న టీడీపీ క్యాడర్
మా భూములు మాకు కావాలి.. తిరగబడ్డ జనం
యంగ్ స్టార్ కదా అని అవకాశమిస్తే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 26 , 2024 | 09:10 AM