రాజమండ్రిలో చిరుత సంచారం కలకలం..
ABN, Publish Date - Sep 25 , 2024 | 08:10 AM
తూ.గో.జిల్లా: రాజమండ్రి రూరల్ కడియం మండలంలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. కడియంలోని ఓ కల్యాణమండపం సమీపంలో నర్సరీలో చిరుతను స్థానికులు చూశారు. వెంటనే అటవిశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫారెస్టు సిబ్బంది.. పాదముద్రలు పరిశీలించి చిరుతపులిగా నిర్దారించారు.
తూ.గో.జిల్లా: రాజమండ్రి రూరల్ కడియం మండలంలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. కడియంలోని ఓ కల్యాణమండపం సమీపంలో నర్సరీలో చిరుతను స్థానికులు చూశారు. వెంటనే అటవిశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫారెస్టు సిబ్బంది.. పాదముద్రలు పరిశీలించి చిరుతపులిగా నిర్దారించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. అటు చిరుత సంచారంతో కడియం మండలం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కాగా చిరుతపులి సంచారంతో ఈరోజు కడియంలోని నర్సరీల్లో పనిచేసే కార్మికులకు సెలవు ప్రకటించారు. చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గమనిస్తున్నారు. చిరుత సంచారం గోదావరి నదీ వైపుగా ఆలమూరు, మడికి గ్రామాలు వైపుగా వెళ్తున్నట్టు అటవీశాఖ అధికారులు అంచనా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ వర్షానికి పొంగిన విజయవాడ పెద్దవాగు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 25 , 2024 | 08:10 AM