ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లిక్కర్ కేసులో కదులుతున్న డొంక..

ABN, Publish Date - Aug 19 , 2024 | 09:38 AM

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి, ఏపీ బేవరేజేస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు పిలిపించి విచారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన కోసం సీఐడీ బృందాలు విస్తృతంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి, ఏపీ బేవరేజేస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు పిలిపించి విచారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన కోసం సీఐడీ బృందాలు విస్తృతంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ కూడా చేసింది. నాలుగు రోజుల క్రితం బెంగళూరులో ఆయన ఆచూకీ సీఐడీకి లభించింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి చెందిన యలహంక ప్యాలెస్‌కు సమీపంలోని ఒక హోటల్లో వాసుదేవరెడ్డి మకాం వేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. రెండ్రోజుల క్రితం ఆయన్ను పిలిపించి విచారించినట్లు తెలిసింది. మొత్తం కుంభకోణం తీరుతెన్నులపై ప్రశ్నించినట్లు సమాచారం.


మద్యం పాలసీ నిర్ణయాలు మొదలుకుని.. విక్రయాలు, ముడుపులు, బ్లాక్‌ మార్కెట్‌ అమ్మకాలు.. కంపెనీల నుంచి వసూలు చేసిన పర్సంటేజీలు, అందులో తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది ఎంత.. ప్రభుత్వ పెద్దల్లో ఎవరి పాత్ర ఎంత.. అనే వివరాలను సీఐడీ అధికారులు రాబట్టారు.


Updated Date - Aug 19 , 2024 | 12:06 PM

Advertising
Advertising