గత పాలకుల నిర్లక్ష్యం.. ఏపీ ప్రజలకు శాపం..
ABN, Publish Date - Sep 18 , 2024 | 07:22 AM
గత పాలకుల నిర్లక్ష్యం, వాళ్లు చేసిన అవకతవకలు.. ఏపీ ప్రజలకు శాపంగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. బుడమేరు, తెలుగుదేశం హయాంలో చేసిన పనులు పూర్తి చేసి ఉంటే.. ఇప్పుడు ప్రజలకు ఈ ఇబ్బంది వచ్చేది కాదన్నారు. బూడమేరు పూర్తిగా కబ్జాచేశారని విమర్శించారు.
అమరావతి: వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం సహాయం ప్రకటించింది. 179 సచివాలయాల పరిధిలో ఇంటికి రూ. 25వేల చొప్పున సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయం ప్రకటించారు. గత పాలకుల నిర్లక్ష్యం, అక్రమాలే ఈ వరదలకు ప్రధాన కారణమన్నారు. బుడమేరు పనులు పూర్తి చేసి ఉంటే ఇబ్బంది వచ్చేదికాదన్నారు. బుడమేరు పూర్తిగా దురాక్రమణ, కబ్జాలకు గురైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పాలకుల నిర్లక్ష్యం, వాళ్లు చేసిన అవకతవకలు ఏపీ ప్రజలకు శాపంగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. బుడమేరు, తెలుగుదేశం హయాంలో చేసిన పనులు పూర్తి చేసి ఉంటే.. ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చేది కాదన్నారు. బూడమేరు పూర్తిగా కబ్జాచేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేదని, ఆ నిధులను డైవర్టు చేశారని ఆరోపించారు. పొలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులు కూడా డైవర్టు చేశారని, అమరావతికి డబ్బులు వద్దని చెప్పారని.. అలాగే రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చిందని సీఎం చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 18 , 2024 | 07:22 AM