కేంద్రం నిధులు ఇస్తే జగన్ ఏం చేశారు?..
ABN, Publish Date - Jul 30 , 2024 | 10:53 AM
అమరావతి: వైసీపీ అధినేత జగన్‌కు ఉన్న ప్రచారపిచ్చి రాష్ట్ర ఖజానాను గుల్లచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ‘‘కోటి రూపాయలో, పది కోట్లో కాదు...700 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని జగన్ తన పేరు, ఫొటోల పిచ్చికోసం తగలేశారు.
అమరావతి: వైసీపీ అధినేత జగన్‌కు ఉన్న ప్రచారపిచ్చి రాష్ట్ర ఖజానాను గుల్లచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ‘‘కోటి రూపాయలో, పది కోట్లో కాదు...700 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని జగన్ తన పేరు, ఫొటోల పిచ్చికోసం తగలేశారు. భూముల సమగ్ర సర్వే పేరిట కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వేకోసం గ్రానైట్ రాళ్లను తీసుకొచ్చి వాటిపై తన తండ్రిపేరు, తనపేరు చెక్కించుకున్నారు. ఈ సరదా తీర్చుకునేందుకు ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు’’ అని నిగ్గు తేల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూశాఖ కార్యకలాపాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సర్వేరాళ్లు, పాసుపుస్తకాలు తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. ఎలాగైనా రీ సర్వే కొనసాగించాలని కొందరు అధికారులు.. రెవెన్యూశాఖ పెద్దలను భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అందులోభాగంగా రీ సర్వేను కొనసాగిద్దామనే తరహాలో సీఎం వద్ద ప్రతిపాదనలు ఉంచారు. వాటిని చూసిన ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘భూములను రీ సర్వే చేయాలని కేంద్రం నిధులు ఇస్తే జగన్ ఏం చేశారు? సరిహద్దులను నిర్దేశించేందుకు సాధారణ రాళ్లను వాడతారు. కానీ జగ న్ కేంద్ర మార్గదర్శకాలకు విరుద్దంగా 77 లక్షల ఖరీదైన గ్రానైట్ రాళ్లను కొన్నారు. వాటిపై తన పేరును ముద్రించుకున్నారు. పాసుపుస్తకాలపై తనపేరు, ఫొటోలు అచ్చు వేయించుకున్నారు. కేంద్రం చెప్పినదానికి భిన్నంగా రీ సర్వేను తన ప్రచార పిచ్చికోసం వాడుకున్నారు’’. ఆయన పిచ్చిపనులకు రూ. 700 కోట్ల ప్రజాధనం వృథా అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో కీలక మలుపు..
తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడి వేడిగా చర్చ..
సభలో ఎమోషనల్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 30 , 2024 | 10:53 AM