ఇలాంటి విజయాన్ని చూడలేదు: సీఎం బాబు
ABN, Publish Date - Nov 15 , 2024 | 01:59 PM
ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైఎస్సార్‌సీపీ విధ్వంసం చేసిందని, పోలవరం ప్రాజెక్ట్‌ను జగన్ అటకెక్కించారని, దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీని నాశనం చేశారని, ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కి నాశనం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, ప్రజల కోసం పనిచేయడం మనందరి బాధ్యతని అన్నారు. ప్రజలు గెలిస్తేనే ఏపీ గెలుస్తుందని చెప్పామని, మాపై నమ్మకంతో ప్రజలు కూటమిని గెలిపించారని అన్నారు. 93 శాతం స్ట్రైకింగ్ రేటుతో కూటమిని గెలిపించారని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి విజయాన్ని చూడలేదని సిఎం చంద్రబాబు అన్నారు.
ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైఎస్సార్‌సీపీ విధ్వంసం చేసిందని, పోలవరం ప్రాజెక్ట్‌ను జగన్ అటకెక్కించారని, దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీని నాశనం చేశారని, ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కి నాశనం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జగన్ దుర్మార్గ పాలనను ప్రజలు అర్థం చేసుకున్నారని, అరాచక పాలనతో విధ్వంసం సృష్టించారని, విభజన వల్ల జరిగిన నష్టం కంటే.. వైసీపీ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని అన్నారు. వైసీపీ అరాచక పాలనతో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
విపక్షంపై నిప్పులు చెరిగిన నారా లోకేష్
వెంకటరెడ్డి అక్రమాలు మరిన్ని వెలుగులోకి
నారాయణ కాలేజీలతో పోటీ పడేలా ఇంటర్ కాలేజీలు
మదనపల్లి ఘటన.. వెలుగులోకి కీలక అంశాలు ..
పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 15 , 2024 | 01:59 PM