మద్యం వ్యాపారులకు సీఎం కీలక ఆదేశాలు
ABN, Publish Date - Oct 29 , 2024 | 08:33 AM
అమరావతి: ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధించాలని, రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మద్యం, ఇసుకపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.
అమరావతి: ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధించాలని, రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మద్యం, ఇసుకపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. బెల్టు షాపులు ఎక్కడా ఉండకూడదని, బెల్టులకు మద్యం సరఫరా చేసే లైసెన్సీలకు మొదటిసారి రూ.5 లక్షలు జరిమానా విధించాలని చెప్పారు. రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయాలన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇక ప్రతి మద్యం షాపులో సీసీ కెమేరాలు ఉండాలని, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలన్నారు. షాపులో ధరల పట్టిక ప్రదర్శించాలని, అలాగే ఇసుక పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ కూడా వెళ్లకూడదని, ఇసుకలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులే తొలి బాధ్యులు అవుతారని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ
ఏబీఎన్ దెబ్బతో తోక ముడిచిన రోత పత్రిక..
ఎమ్మార్పీ ఉల్లంఘనకు 5 లక్షల జరిమానా
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 29 , 2024 | 08:33 AM