ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాకు బస్సు కావాలి సర్.. సీఎంకు మహిళ విజ్ఞప్తి

ABN, Publish Date - Nov 30 , 2024 | 04:11 PM

Andhrapradesh: అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక - పేదల సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను, వారి విన్నపాలను సీఎం స్వయంగా వింటున్నారు. ఇందులో భాగంగా ఓ మహిళ మాట్లాడుతూ.. మా ఊరికి బస్సు కావాలి సర్ అని సీఎంకు విజ్ఞప్తి చేసింది.

అనంతపురం, నవంబర్ 30: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక - పేదల సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను, వారి విన్నపాలను సీఎం స్వయంగా వింటున్నారు. ఇందులో భాగంగా ఓ మహిళ మాట్లాడుతూ.. మా ఊరికి బస్సు కావాలి సర్ అని సీఎంకు విజ్ఞప్తి చేసింది. ‘‘స్కూల్‌కు వెళ్లేందుకు బస్సు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లలు బస్సు సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మా ఊరికి పెద్ద పేరు ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం లేదు. దయచేసి బస్సు సౌకర్యం కల్పించాలని సీఎం చంద్రబాబును మనస్పూర్తిగా కోరుతున్నాము’’ అని మహిళ వినతి చేసింది.

కంగారూలకు చావుదెబ్బ


కాగా అంతకుముందు.. నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్‌ను సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు. అనంతరం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. ఆపై వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో దిగారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్ ఇవ్వడం పట్ల లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

అర్ధరాత్రి గందరగోళం.. వార్డెన్‌ సస్పెండ్

షాకింగ్.. మళ్లీ పంజుకున్న బంగారం, వెండి ధరలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 30 , 2024 | 04:14 PM