అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ పడిందిగా..
ABN, Publish Date - Nov 19 , 2024 | 04:42 PM
Andhrapradesh: గేట్లు పెట్టామని, స్పిల్‌వే పనులు పూర్తి చేశామని, స్పిల్ ఛానల్ పనులను సమర్థవంతంగా పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. దాదాపు 72 శాతం పనులను పూర్తిచేసినట్లు తెలిపారు. 28 సార్లు ప్రాజెక్టు వద్దకు నేరుగా వెళ్లినట్లు తెలిపారు. 82 సార్లు వర్చువల్‌గా రివ్యూ చేశామన్నారు. ఒక్కోసారి కేంద్ర నిధులు ఇవ్వకపోయినా డబ్బుల ఖర్చు చేసి రీయింబర్స్ తెచ్చుకున్నామని చెప్పారు.
అమరావతి, నవంబర్ 19: సాగునీటి ప్రాజెక్టులు- పోలవరంపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మాట్లాడుతూ.. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘పోలవరం ప్రాజెక్టులో కీలకమైనది డయాఫ్రం వాల్.. అయితే గతంలో పనిచేసిన ఇరిగేషన్ శాఖ మంత్రి డయాఫ్రం వాల్ ఎక్కడో కనపడలేదని అన్నారు. అన్ని ప్రాజెక్టులకు డయాఫ్రం వాల్ ఉంటుందని అంటారు. సబ్జెక్ట్ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కానీ నేర్చుకోవాలనే ధ్యాస ఉండాలి’’ అని సీఎం అన్నారు. జర్మన్‌కు చెందిన బావర్ కంపెనీని రప్పించి 414 రోజుల్లో డయాఫాం వాల్‌ను పూర్తి చేశామన్నారు. స్పిల్‌వే గేట్లు సిద్ధం చేశామని తెలిపారు.
పీపీఏ, సీడబ్ల్యూసీ అనుమతులను తీసుకుని ముందుకు వెళ్లామన్నారు. గేట్లు పెట్టామని, స్పిల్‌వే పనులు పూర్తి చేశామని, స్పిల్ ఛానల్ పనులను సమర్థవంతంగా పూర్తి చేశామని చెప్పారు. దాదాపు 72 శాతం పనులను పూర్తిచేసినట్లు తెలిపారు. 28 సార్లు ప్రాజెక్టు వద్దకు నేరుగా వెళ్లినట్లు తెలిపారు. 82 సార్లు వర్చువల్‌గా రివ్యూ చేశామన్నారు. ఒక్కోసారి కేంద్ర నిధులు ఇవ్వకపోయినా డబ్బుల ఖర్చు చేసి రీయింబర్స్ తెచ్చుకున్నామని చెప్పారు. 2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగినట్లైతే 2020-21కి పోలవరం పూర్తి అయి జాతికి అంకితం అయ్యేదని సీఎం తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిందని.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే పోలవరాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించారని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నీటిపారుదల రంగంపై మంత్రి నిమ్మల కామెంట్స్
YS Sunitha: ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీతా రెడ్డి
Real Latest AP News And Telugu News
Updated Date - Nov 19 , 2024 | 04:43 PM