ఫస్ట్ టైం మంత్రివి.. సీఎం వార్నింగ్..
ABN, Publish Date - Nov 04 , 2024 | 01:37 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు క్లాస్ తీసుకున్నారు . టీడీపీ సభ్యత్వ నమోదుకు సంబంధించి మంత్రికి సీఎం గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో వెనుకబడి ఉన్నారని.. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా ఎమ్మెల్యేను, మంత్రిని చేశానని.. రాజకీయాలపై సీరియస్‌నెస్ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
అమరావతి: రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపేందుకు శాయశక్తులా శ్రమిస్తున్న నేత. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. తాను పరుగులు పెట్టడంతో పాటు ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే తప్పు చేసిన నాయకుల పట్ల కూడా సీఎం సీరియస్‌గా ఉంటున్నారు. స్వంత పార్టీ నేతలను కూడా క్రమశిక్షణలో ఉండాలని.. ఎలాంటి తప్పు చేయకూడదని గట్టిగానే చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మంత్రి శుభాష్‌కు ఫోన్ చేసి సీరియస్‌గా క్లాస్ తీసుకున్నారు.
‘‘శుభాష్ గారు చెప్పండి.. హా సార్.. సార్.. నియోజకవర్గంలో సభ్యత్వం నమోదు అవుతుంది సార్.. ఈరోజు వీఆర్వోతోపాటు కార్యకర్తలు వెళ్లారు సార్.. చూడయ్యా నువ్వేమి మాట్లాడవద్దు.. సభ్యత్వ నమోదులో అందరికంటే వెనుకబడి ఉన్నావు. రాజకీయాలపై నీకు సీరియస్ తనం రాలేదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, ఫస్ట్ టైం మంత్రివి సభ్యత్వ నమోదులో ఎక్కడున్నావో చూసుకున్నావా.. రంపచోడవరంలో 20 శాతం, రామచంద్రాపురం 29 శాతం మాత్రమే సభ్యత్వం నమోదు అయింది. 9 వేలకు గాను 2630 మాత్రమే చేశారు. ఫస్ట్ టైం వచ్చావు నీకు పార్టీ చాలా గౌరవించింది. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన నీకు ఎమ్మెల్యే ఇచ్చి మంత్రిని చేశాం. నీకు పట్టుదల లేకపోతే ఎలా . సీరియస్‌గా తీసుకోవాలి. నా బాధ్యత నేను చేస్తున్న.. మీ వాయిస్ మీరు చేయాలి. పార్టీకి ఉపయోగపడకపోతే రాజకీయాలు ఎందుకు. మీరు పని చేయకపోతే ఎమ్మెల్యేగా ఎలా ప్రూవ్ చేసుకుంటారు. మీరు ప్రూవ్ చేసుకోకపోతే ఆల్టర్నేట్ చూసుకుంటా.. పార్టీకి ఉపయోగపడకపోతే రాజకీయాలు ఎందుకు.. నేను 95 సీఎంని అని అందరికీ చెప్తున్నా’’ అంటూ మంత్రి వాసంశెట్టి శుభాష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఈ వ్యవహారం పార్టీతో పాటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
శివాలయానికి పోటెత్తిన భక్తులు..
మాజీ సర్పంచ్‌ల అరెస్టులను ఖండిస్తున్న.. : హరీష్‌రావు
సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 04 , 2024 | 01:37 PM