ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

ABN, Publish Date - Nov 08 , 2024 | 08:42 AM

ప్రస్తుతం అమల్లో ఉన్న ‘తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం 2020’ ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ అధికారం తహసీల్దార్లకు మాత్రమే ఉంది. దాని స్థానంలో ప్రభుత్వం తీసుకురానున్న ‘ఆర్వోఆర్‌-2024’ చట్టంలో నాయిబ్‌ తహసీల్దార్లకు ఆ అధికారాన్ని ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై అభిప్రాయాలను క్రోడీకరించిన అధికారులు ముసాయిదా ప్రతిని సీఎం రేవంత్‌ రెడ్డికి అందజేశారు.

హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ అధికారం నాయిబ్‌(డిప్యూటీ) తహసీల్దార్లకు (Deputy Tehsildars) దాఖలు పడనుందా.. ప్రభుత్వంలోని విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం 2020’ ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ (Registration of Agricultural Lands) అధికారం (Power) తహసీల్దార్లకు మాత్రమే ఉంది. దాని స్థానంలో ప్రభుత్వం తీసుకురానున్న ‘ఆర్వోఆర్‌-2024’ చట్టంలో నాయిబ్‌ తహసీల్దార్లకు ఆ అధికారాన్ని ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై అభిప్రాయాలను క్రోడీకరించిన అధికారులు ముసాయిదా ప్రతిని సీఎం రేవంత్‌ రెడ్డికి (CM Revanth Reddy) అందజేశారు. తహసీల్దార్లు మండలమంతా పర్యటించాల్సి ఉండటం, వారికి ఇప్పటికే పలు రకాల బాధ్యతలు ఉండటం, వారిపై పని ఒత్తిడి.. వంటివాటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


నాయిబ్‌ తహసీల్దార్లు కార్యాలయ వ్యవహారాలకే పరిమితమై ఉంటున్నందున, వారి చేతిలో రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను పెడితే.. రైతులకు అందుబాటులో ఉంటారనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. వారు తీసుకున్న నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌ చేసుకునే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అప్పిలేట్‌ అధికారాలను కలెక్టర్‌ లేదా జేసీ పరిధిలో పెడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు పాత రెవెన్యూ విధానంలో ఉన్నట్లు జాయింట్‌ కలెక్టర్ల వ్యవస్థను పునరుద్ధరించే యోచనలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఇటీవల సుమారు 40 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు సెలక్షన్‌ గ్రేడ్‌ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పీల్‌ 1 ఆర్డీవో పరిధిలో, అప్పీల్‌ 2 జేసీ లేదా కలెక్టర్‌ పరిధిలో ఉండాలని తహసీల్దార్లు కోరుతున్నప్పటికీ.. కొత్త చట్టంలో అప్పీల్‌ అధికారాన్ని కలెక్టర్‌/ జేసీ పరిధిలో ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం...

జగన్ ‘మాడా’ మాటలు మాట్లాడటం సిగ్గుచేటు

వైసీపీ నేత హరికృష్ణారెడ్డి అరెస్ట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 08 , 2024 | 08:42 AM