ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

ABN, Publish Date - Nov 29 , 2024 | 09:19 AM

హైదరాబాద్: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా.. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ముందెన్నడూ లేని విధంగా ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు, ఆస్పత్రుల్లో నియామకాలపైనా దృష్టి సారించారని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా.. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ముందెన్నడూ లేని విధంగా ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు, ఆస్పత్రుల్లో నియామకాలపైనా దృష్టి సారించారని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రెండింతలు చేసినట్లు గుర్తుచేసింది. తొలి ఏడాదిలోనే వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చేపట్టామని, నూతన వైద్య, నర్సింగ్‌, పారామెడికల్‌ కళాశాలలను మంజూరు చేశామని వివరించింది. మెడికల్‌ కాలేజీల్లో సీట్లు, ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డుల జారీ పైలెట్‌ ప్రాజెక్టును చేపట్టామని పేర్కొంది.


ఆరోగ్యశ్రీ కింద నెలకు 73 కోట్ల వ్యయం

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద 2014 నుంచి 2023 అక్టోబరు వరకు గత ప్రభుత్వం నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేస్తే.. 2023 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు తమ ప్రభుత్వం నెలకు సగటున రూ.76 కోట్లను వ్యయం చేసిందని సీఎంవో తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని గుర్తుచేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరలను సుమారు 20ు వరకు పెంచామని, కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని, దీంతో ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య 1,835కి పెరిగిందని వివరించింది. పెరిగిన ధరలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల కోసం అదనంగా రూ.487.29 కోట్లను కేటాయించామని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

దర్జాగా రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడ్డ పులి

ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

తీరంలో కనకం వేట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 29 , 2024 | 01:15 PM