సీఎం రేవంత్ సైలెంట్ ఆపరేషన్..
ABN, Publish Date - Sep 12 , 2024 | 09:45 AM
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ఛైర్మన్ నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సైలెంట్ ఆపరేషన్‌తో బీఆర్ఎస్ బేజేరవుతోంది. కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ పదవిలో నియామితులయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ఛైర్మన్ నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సైలెంట్ ఆపరేషన్‌తో బీఆర్ఎస్ బేజేరవుతోంది. కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ పదవిలో నియామితులయ్యారు. దీంతో ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య రాజకీయ రణానికి దారి తీస్తోంది. పరస్పర విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి. పీఏసీ ఛైర్మన్‌గా గాంధీని ఎలా నియమిస్తారని కారు పార్టీ ప్రశ్నిస్తోంది. ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడిసారని బీఆర్ఎస్ నేతలు మండిపడడం రాజకీయంగా కాకరేపుతోంది. మరోవైపు ‘ఇది నీవు నేర్పిన విద్యే కదా?.. మీరాజాక్షా’ అంటూ కాంగ్రెస్ కౌంటరిస్తోంది. గతంలో బీఆర్ఎస్ చేసిందేమిటి? సంప్రదాయాలకు పాతరేసింది కారు పార్టీ కాదా? అని ప్రశ్నించడంతో రాజకీయ వేడి రగులుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అబద్ధాలతో పుట్టి.. ఫేక్‌తో పెరిగి..
గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక
కాకినాడ వరద బాధితులకు చంద్రబాబు భరోసా
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 12 , 2024 | 09:48 AM