సీఎం సిద్ధరామయ్య వర్సెస్ గవర్నర్..
ABN, Publish Date - Aug 19 , 2024 | 08:00 AM
కర్నాటక: కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు సామాజిక కార్యకర్తలు వేసిన పిటిషన్ ఆధారంగా సీఎంపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఆదేశించారు. మైసూర్ నగర అభివృద్ధి సంస్థ ఉడా స్థలాల పంపిణీలో అక్రమాలపై సీఎం సిద్ద రామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు.
కర్నాటక: కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు సామాజిక కార్యకర్తలు వేసిన పిటిషన్ ఆధారంగా సీఎంపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఆదేశించారు. మైసూర్ నగర అభివృద్ధి సంస్థ ఉడా స్థలాల పంపిణీలో అక్రమాలపై సీఎం సిద్ద రామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు. సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ఉడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక అదేశాలతో ఉడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇలాంటి చేపను మీరెక్కడా చూసి ఉండరు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 19 , 2024 | 08:00 AM