తెలంగాణ ప్రభుత్వంతో కాగ్నిజెంట్ ఎంవోయు..
ABN, Publish Date - Aug 06 , 2024 | 09:28 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో తొలిరోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్‌లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో తొలిరోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్‌లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 20 వేల మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలిగి ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నెలకొల్పుతామని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ ప్రకటించారు. 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో తొలి కార్యాలయం ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలో ఐదు కార్యాలయాలు, 18 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది.
కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో మరింత విస్తరించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్టు సీఈవో రవికుమార్ వెల్లడించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారుల బృందం న్యూజెర్సీలోని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయంలో సీఈవో రవికుమార్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జీహెచ్ఎంసీలో మరో అవినీతి తిమింగలం..
వైసీపీ నేతలకు వణుకుపుట్టిస్తున్న మంత్రి..
అమెరికాను వణికిస్తున్న మాంద్యం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 06 , 2024 | 09:28 AM