ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూతలస్వర్గం అంటే ఇదేనేమో..

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:07 PM

National: మంచుకురిసే వేళలో కశ్మీర్ అందాలను వర్ణించడానికి మాటలు చాలని విధంగా ప్రకృతి సోయగం కన్నుల విందు చేస్తోంది. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతోంది. హిమపాతం ఆకట్టుకుంటోంది. గుల్మార్గ్, పహల్గా వంటి ప్రాంతాల్లోని కొండలు లోయలు మంచు అందాలను పరిచయం చేస్తున్నాయి. ఓ వైపు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ ఇక్కడ అందమైన ప్రాంతాలు మాత్రం

అందాల కశ్మీరంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. కశ్మీర్ లోయలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శ్రీనగర్ సిటీలో మైనస్ 0.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. నీరు గడ్డకట్టే స్థాయి సున్నా డిగ్రీల కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రత నమోదు అవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఇది ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతగా అధికారులు తెలిపారు. కశ్మీర్‌లో కురుస్తున్న హిమపాతంలో అక్కడి కొండలు, లోయలు ప్రాంతాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. మంచుకురిసే వేళలో కశ్మీర్ అందాలను వర్ణించడానికి మాటలు చాలని విధంగా ప్రకృతి సోయగం కన్నుల విందు చేస్తోంది. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతోంది. హిమపాతం ఆకట్టుకుంటోంది.


గుల్మార్గ్, పహల్గా వంటి ప్రాంతాల్లోని కొండలు లోయలు మంచు అందాలను పరిచయం చేస్తున్నాయి. ఓ వైపు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ ఇక్కడ అందమైన ప్రాంతాలు మాత్రం పర్యాకులను, ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మంచు దుప్పటిలోని కశ్మీరం అందమైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పర్యాటకులు కూడా కశ్మీర్ మంచు అందాల దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కశ్మీర్ మంచు అందాల ఫోటోలు, వీడియోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భూతలస్వర్గం అంటే ఇదేనేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్‌‌లో కశ్మీర్‌కు ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్ వేయాల్సిందే అని మరికొందరు ఔత్సాహికులు ఉవ్విళ్లూరుతున్నారు.


ఇవి కూడా చదవండి...

Donald Trump: గుండు కొట్టించిన వ్యక్తినే అందలమెక్కించి.. ట్రంప్ వీడియో వైరల్

రోజూ రూ. 171 సేవ్ చేసి.. రూ. 28 లక్షలు దక్కించుకోండి..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 04:10 PM