ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పక్కా ప్లానింగ్‌తోనే బంగ్లాదేశ్‌లో ఆందోళనలు..

ABN, Publish Date - Sep 27 , 2024 | 10:37 AM

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన ఇటీవలి ఆందోళనల వెనుక ఉన్న ‘సూత్రధారులను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మొహమ్మద్‌ యూనస్‌ ప్రపంచానికి పరిచయం చేశారు.

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన ఇటీవలి ఆందోళనల వెనుక ఉన్న ‘సూత్రధారులను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మొహమ్మద్‌ యూనస్‌ ప్రపంచానికి పరిచయం చేశారు. అవి పక్కా ప్రణాళికతో నిర్వహించిన ఆందోళనలని, అదో క్రమశిక్షణతో కూడిన తిరుగుబాటు అని యూనస్‌ వెల్లడించారు. ఏ ఒక్కరినో నాయకుడిగా గుర్తించడానికి లేదా అరెస్టు చేయడానికి అవకాశమే లేకుండా నిర్వహించడం వల్ల ఆ ఆందోళనలు మరింత శక్తిమంతంగా మారాయని పేర్కొన్నారు.


ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 79వ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన యూనస్ అక్కడ క్లింటన్‌ గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇటీవలి బంగ్లాదేశ్‌ ఆందోళనలను ఆయన ఆ కార్యక్రమంలో ప్రస్తావించారు. అవి యాధృచ్ఛికంగా జరిగిన ఆందోళనలు కావని, అవి ఎంతో జాగ్రత్తగా రూపొందించిన ఆందోళనలని యూనుస్‌ తెలిపారు. ఢాకా ట్రైబ్యున్‌ పత్రిక కథనం మేరకు తన ప్రత్యేక సహాయకుడు మహఫూజ్‌ ఆలంను ఆ కార్యక్రమంలో యూనస్‌ పరిచయం చేశారు.

Updated Date - Sep 27 , 2024 | 10:37 AM