అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి?
ABN, Publish Date - Aug 12 , 2024 | 07:23 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరికి బెయిల్ వస్తోంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా బెయిల్‌పై విడుదల అయ్యారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి? అది ఎలా జరిగింది?..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case)లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరికి బెయిల్ వస్తోంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) కూడా బెయిల్‌పై విడుదల అయ్యారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి? అది ఎలా జరిగింది?.. ప్రభుత్వ హయాంలో ఉన్న లిక్కర్ అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తూ 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం (Kejriwal Govt.,) కొత్త లిక్కర్ పాలసీ (New Liquor Policy) తీసుకువచ్చింది. ఢిల్లీలో అప్పటివరకు 60 శాతం మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో, 40 శాతం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేవి. 2021 పాలసీ ప్రకారం వాటిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు.
ఢిల్లీని 32 జోన్లుగా విభజించి పెద్ద సంఖ్యలో షాపులు పెట్టుకునేందుకు అనుమతించారు. ఎమ్మార్పీ కాకుండా తమకు నచ్చిన ధరకు లిక్కర్ అమ్ముకునే వేసులుబాటు కూడా ఉంది. అంతేకాదు.. ఉదయం 3 గంటల వరకు షాపులు తెరవచ్చు. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించడంవల్ల ప్రభుత్వ ఆదాయం రూ. 9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు టెండర్లు వేసి మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఇందు కోసం ఢిల్లీ ప్రభుత్వం లైసెన్స్ ఫీజు భారీగా వసూలు చేసింది. కొత్త లిక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్లు లైసెన్సు కోసం రూ. 25 లక్షలు చెల్లించేవారు. అయితే కొత్త లిక్కర్ పాలసీ వచ్చాక ఎల్1 లైసెన్సు కోసం రూ. 5 కోట్లు చెల్లించారన్న వాదనలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
దువ్వాడ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 12 , 2024 | 07:23 AM