ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వారికి మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్..

ABN, Publish Date - Nov 04 , 2024 | 08:41 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక బ్లాక్ మార్కెట్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే ప్రజలు ఎదురు తిరగాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక బ్లాక్ మార్కెట్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే ప్రజలు ఎదురు తిరగాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. కొంతమందికి ఇసుక దందా అలవాటుగా మారిపోయిందని ఆయన మండిపడ్డారు. దాన్ని మార్చేందుకు సీఎం చంద్రబాబు, తాను ప్రయత్నిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇసుక ద్వారా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అలాంటి వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత స్థానిక గ్రామస్థులకు ఉందని పవన్ ఉద్ఘాటించారు. ఇసుకపై స్థానికులకు హక్కు ఉంటుందని, సొంత అవసరాలకు ఎడ్ల బండి లేదా ట్రాక్టర్‌తో వచ్చి ఉచితంగా ఇసుక తీసుకువెళ్లొచ్చని ఆయన చెప్పారు. ఇసుక విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ప్రస్తుతం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్ధరాత్రి నడిరోడ్డుపై అమ్మ..

ఒకే టీచర్.. ఒకే స్టూడెంట్..

శివాలయానికి పోటెత్తిన భక్తులు..

మాజీ సర్పంచ్‌ల అరెస్టులను ఖండిస్తున్న.. : హరీష్‌రావు

సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 04 , 2024 | 08:41 PM