ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫలితాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:26 AM

రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్న డోనల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. అతిపెద్ద నగరమైన పెన్సిల్వేనియాలోని ఓటింగ్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు. పెన్సిల్వే నియాలో అనూహ్యంగా అధిక ఓటర్లు ఉన్నట్లు అక్కడి వార్తా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ట్రంప్‌ దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా, నవంబర్ 6: ఎంతో ఉత్కంఠగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో (America Election Results) అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అప్పటి వరకు విజయానికి దగ్గరలోకి దూసుకెళ్లిన డోనాల్డ్ ట్రంప్‌ వెనకపడిపోయారు. ఒక్కసారిగా కమలా హారిస్.. ట్రంప్‌కు చేరువలోకి వెళ్లిపోయారు. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ మధ్య 20 ఎలక్టోరల్ ఓట్ల తేడా నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్న డోనల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు.


అతిపెద్ద నగరమైన పెన్సిల్వేనియాలోని ఓటింగ్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు. పెన్సిల్వేనియాలో అనూహ్యంగా అధిక ఓటర్లు ఉన్నట్లు అక్కడి వార్తా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ట్రంప్‌ దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పెన్సిల్వేనియాలో జరుగుతున్న భారీ మోసం గురించి చర్చలు జరుగుతున్నాయి. చట్టం అమలులోకి వస్తోంది’’ అని తన ట్రూత్ సామాజిక మాద్యమంలో రాసుకొచ్చారు. అమెరికాలోని అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే పెన్సిల్వేనియాలో గెలవాల్సిన పరిస్థితి తప్పనిసరి. అయితే పెన్సిల్వేనియాలో చాలా పెద్ద మొత్తంలో మోసం జరిగిందంటూ ట్రంప్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరింత సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి..


ఇవి కూడా చదవండి...

US Election Counting: అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు

Stock Markets: దేశీయ మార్కెట్లపై అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం

Read Latest Telugu News

Updated Date - Nov 06 , 2024 | 11:30 AM