ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఢిల్లీ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ..

ABN, Publish Date - Sep 17 , 2024 | 07:19 AM

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనాను కలుసుకుని తన రాజీనామాను సమర్పిస్తారు. మరోవైపు ముఖ్యమంత్రిగా..

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనాను కలుసుకుని తన రాజీనామా లేఖను సమర్పిస్తారు. మరోవైపు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే నేపథ్యంలో సీఎం కుర్చీపై ఎవరిని కూర్చోబెట్టాలన్న అంశంపై సోమవారం ఆప్ కీలక సభ్యులతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం సీఎం అభ్యర్థి ఎవరనేది కేజ్రీవాల్ వెల్లడిచేయనున్నారు. ఈ క్రమంలో నేతల్లో ఉత్కంఠ నెలకొంది.


కొత్త సీఎం ఎవరవుతారనేదానిపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అగ్రస్థానంలో ఢిల్లీ విద్య, ప్రజాపనుల శాఖల మంత్రి ఆతిషి ఉన్నారు. సిసోడియా అరెస్టు తర్వాత విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ఆతిషి ఢిల్లీలో స్కూళ్లను మెరుగుపరిచి వాటిలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పటానికి విశేష కృషి చేశారు. కేజ్రీవాల్‌, సిసోడియా జైలుకు వెళ్లటంతో.. మీడియా ఎదుట పార్టీ విధానాలను, నిర్ణయాలను వివరించే బాధ్యతలు తీసుకున్నారు. ప్రతిపక్ష బీజేపీ విమర్శలను గట్టిగా ఎదుర్కొన్నారు. ఆతిషి తర్వాత.. మరో మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌, ఎంపీలు రాఘవ్‌ చద్దా, సంజయ్‌సింగ్‌, ఆప్‌ సీనియర్‌ నేత కైలాశ్‌ గెహ్లాట్‌ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని నిర్మాణాలు సేఫ్‌

పదైదు వేల గతం.. మరిచావా జగన్‌?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 17 , 2024 | 07:20 AM

Advertising
Advertising