రైతులకు రుణమాఫీ చేయాల్సిందే: రేవంత్ రెడ్డి
ABN, Publish Date - May 16 , 2024 | 10:01 AM
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున.. నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకువచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై సైలెన్స్
మోసం చేసిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి..!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 16 , 2024 | 10:01 AM