ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేంద్ర మంత్రి నిర్మలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

ABN, Publish Date - Sep 29 , 2024 | 11:35 AM

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(ఏ1), ఈడీ (ఏ2), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(ఏ3), మాజీ ఎంపీ నళిన్‌కుమార్‌(ఏ4), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(ఏ5), రాష్ట్ర బీజేపీ నేతల(ఏ6)పై ఐపీసీ 384, 120 బీ, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బెంగళూరు: ఎన్నికల బాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ అంశంపై జనాధికార సంఘర్ష పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఆదర్శ్‌ అయ్యర్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ 42వ ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్‌నగర్‌ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 10కి వాయిదా వేసింది. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.


కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(ఏ1), ఈడీ (ఏ2), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(ఏ3), మాజీ ఎంపీ నళిన్‌కుమార్‌(ఏ4), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(ఏ5), రాష్ట్ర బీజేపీ నేతల(ఏ6)పై ఐపీసీ 384, 120 బీ, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎలక్టోరల్‌ బాండ్ల ముసుగులో వివిధ కార్పొరేట్‌ కంపెనీల ఎండీలు, సీఈవోలను బెదిరించి రూ.8వేల కోట్లు దోపిడీ చేశారని ఆదర్శ్‌ అయ్యర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ‘‘ఎఫ్‌ఐఆర్‌ నమోదైనందున కేంద్ర మంత్రి నిర్మల తన పదవికి రాజీనామా చేస్తారా’’ అని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హై స్పీడ్ కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం..

జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

72 అడుగుల డూండీ గణేష్ నిమర్జనం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 29 , 2024 | 11:35 AM