వాటర్ ట్యాంక్‌పై వినాయకుడు.. ఐడియా అదిరింది..
ABN, Publish Date - Sep 11 , 2024 | 11:51 AM
వనపర్తి జిల్లా: సాధారణంగా వినాయకుడి మండపాన్ని భూమినుంచి కొంత ఎత్తులో ఏర్పాటు చేస్తారు. కానీ వనపర్తి జిల్లా, రేవల్లి మండల కేంద్రంలో కొందరు గణేష్ ఉత్సవ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మధ్యలో సెంట్రింగ్ కర్రల సహాయంతో మండపం ఏర్పాటు చేశారు.
వనపర్తి జిల్లా: సాధారణంగా వినాయకుడి మండపాన్ని భూమినుంచి కొంత ఎత్తులో ఏర్పాటు చేస్తారు. కానీ వనపర్తి జిల్లా, రేవల్లి మండల కేంద్రంలో కొందరు గణేష్ ఉత్సవ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మధ్యలో సెంట్రింగ్ కర్రల సహాయంతో మండపం ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని వడ్లగేరులో 30 ఏళ్ల కిందట వాటర్ ట్యాంక్‌ను నిర్మించారు. అయితే అప్పటి నుంచే వినాయక మండపాన్ని కింద ఏర్పాటు చేయకుండా ట్యాంక్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసి పూజిస్తున్నారు.
నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా అక్కడే బొజ్జగణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. అక్కడ ప్రతిష్టించడంవల్ల మంచి జరుగుతుందని, అందుకే ఏటా వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేసి పూజిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. చెక్కలతో సెంటింగ్ ఏర్పాటు చేసి గ్రామస్తుల సాయంతో వినాయకుడి ప్రతిమను అక్కడ కొలువుదీర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. భకులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా మెట్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో వాన వచ్చినా.. వరద వచ్చినా.. ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపారు. అయితే అంత ఎత్తులో ఏర్పాటు చేసిన గణనాథుని అటుగా వెళ్లేవాళ్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. నిర్వాహకులు వెరైటీ ఆలోచనకు ఫిదా అవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర ఆర్థిక సంఘంతో రేవంత్ రెడ్డి బృందం భేటీ.. (ఫోటో గ్యాలరీ)
గోదావరి మహోగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక..
అందుకే తేజస్వీతో సీఎం నితీశ్ భేటీ...
ఉచిత ఇసుక..నేటి నుండే పోర్టల్ ప్రారంభం..
రచ్చరేపుతున్న రెడ్‌బుక్ రాజకీయాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 11 , 2024 | 11:51 AM