ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రముఖుల శుభాకాంక్షలు

ABN, Publish Date - Oct 15 , 2024 | 11:35 AM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ కడియం కావ్య, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ , మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ , మంత్రి టీజీ భరత్ శుభాకంక్షలు తెలిపారు.

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణగారు, డైరక్టర్ భానుగారు, అందులో పనిచేస్తున్న సిబ్బంది.. ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులను ప్రభుత్వాన్ని తట్టి లేపే విధంగా ఉన్నది ఉన్నట్టుగా చూపించే చానల్.. మరింత ముందుకు సాగాలని, తెలుగు ప్రజలకు మరింత దగ్గర కావాలని ఆకాంక్షిస్తూ 15వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపారు’’


వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ అక్షరమే ఆయుధంగా 15 వసంతాలు పూర్తి చేసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చానల్, సిబ్బందికి.. అలాగే నిరంతరంగా అభిమానిస్తూ.. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఎంపీ కావ్య శుభాకాంక్షలు తెలిపారు.

టీడీపీ నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. 15 సంవత్సరాలు ఒక బలమైనటువంటి ముద్ర వేసుకుని ప్రజల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదని.. అది ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి విశేషమైన స్థానం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ 15వ వార్షికోత్సవం సందర్బంగా రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు.

కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. ఏబీఎన్ యాజమాన్యానికి, సిబ్బందికి 15వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల మన్ననలు మరింతగా పొంది మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.


కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం, సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, సిబ్బందికి మనసా వాచా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ యనలేని సేవ చేస్తున్నారని కొనియాడారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ‘ఆర్కే అంటే ఏబీఎన్.. ఏబీఎన్ అంటే ఆర్కే’ అని అన్నారు. భవిష్యత్‌లో కూడా బెస్ట్ చానల్‌గా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి లక్ష్యంగా హ్యాకర్ల దాడులు..

వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు..

తుఫాన్‌గామారనున్న అల్పపీడనం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 15 , 2024 | 11:35 AM