Harsha Sai Controversy: 10 కోట్లు ఇస్తే ఏమైనా చేస్తా..హర్ష సాయి మరో ఆడియో లీక్

ABN, Publish Date - Sep 28 , 2024 | 02:35 PM

యూట్యూబర్ హర్షసాయికి(Harsha Sai Controversy) సంబంధించిన మరో ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది.

హైదరాబాద్: యూట్యూబర్ హర్షసాయికి(Harsha Sai Controversy) సంబంధించిన మరో ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి బాధితురాలికి, హర్షకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బెట్టింగ్ యాప్‌ను తన ఛానల్‌లో ప్రమోట్ చేస్తే ఎన్ని కోట్లైనా ఇస్తారని హర్ష సాయి అంటాడు. రూ.10 కోట్లు ఇస్తే ఏమైనా చేస్తానని చెప్తాడు. దీంతో.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లను ఆపేయాలని బాధితురాలు హర్షను కోరుతుంది. తాను కాకపోతే మరో పదిమందితో నిర్వాహకులు ప్రమోషన్స్ చేయిస్తారని హర్ష బదులిస్తాడు. దీంతో బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి..

Updated Date - Sep 28 , 2024 | 02:35 PM