కృష్ణమ్మ ఉగ్రరూపం.. లంక కన్నీళ్లు..
ABN, Publish Date - Sep 04 , 2024 | 07:36 AM
బాపట్ల జిల్లా: కృష్ణమ్మ మహోగ్రరూపానికి బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు విలవిల్లాడిపోయాయి. జనం కట్టుబట్టలతో బతుకుజీవుడా అంటూ డాబాలపై తలదాచుకున్నారు. ఎటు చూసినా వరద నీరే.. అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించి బాధితులకు ఆహారం, నీటిని అందించి ఆకలిదప్పులు తీర్చింది.
బాపట్ల జిల్లా: కృష్ణమ్మ మహోగ్రరూపానికి బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు విలవిల్లాడిపోయాయి. జనం కట్టుబట్టలతో బతుకుజీవుడా అంటూ డాబాలపై తలదాచుకున్నారు. ఎటు చూసినా వరద నీరే.. అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించి బాధితులకు ఆహారం, నీటిని అందించి ఆకలిదప్పులు తీర్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ఎగువ నుంచి పోటెత్తిన వరదల ధాటికి కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది.
ప్రకాశం బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో 11.47 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో బాపట్ల జిల్లాలో లంక గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఒక్కసారిగా గ్రామాన్ని వరద చుట్టిముట్టేయడంతో నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ డాబాలపై తలదాచుకున్నారు. ఎటు చూసినా నీరే కనిపించడంతో భయకంపీతులయ్యారు. తమ జీవితకాలంలో ఇలాంటి వరదను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీకి భారీ విరాళాలు.. సీఎం కృతజ్ఞతలు..
అందుకే అక్కడికి వెళ్లలేదు..: పవన్ కల్యాణ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 04 , 2024 | 07:36 AM