ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక..

ABN, Publish Date - Sep 11 , 2024 | 08:57 AM

రాజమండ్రి: గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. అటు శబరి, సీలేరు ఉపనదుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఏజెన్సీ ప్రజలు మళ్లీ హడలిపోతున్నారు. అల్లూరిసీతారామరాజు జిల్లా పరిధిలోని కూనవరం మండలంలో గోదావరికి వరద పోటెత్తడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

రాజమండ్రి: గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. అటు శబరి, సీలేరు ఉపనదుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఏజెన్సీ ప్రజలు మళ్లీ హడలిపోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని కూనవరం మండలంలో గోదావరికి వరద పోటెత్తడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం, కూనవరం మధ్య సంబంధాలు తెగిపోయి ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే పాఠశాలలు మూతపడగా.. మూడు రోజుల నుంచి ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిషా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడంతో శబరి ఉపనది వేగంగా గ్రామాలను చుట్టిముట్టింది. కూనవరంలో శబరి గోదావరి సంగమం కావడంతో ఆ ప్రదేశం సముద్రాన్ని తలపిస్తోంది. ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించేందుకు అధికారులు లాంఛీలు సిద్ధం చేశారు.


మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు గోదావరిలో కలుస్తోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు పెరిగింది. బ్యారేజ్‌కు చెందిన 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి 13.27 లక్షల క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతోంది. పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. గోదావరి వరద నేపథ్యంలో తూర్పుగోదావరి, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉచిత ఇసుక..నేటి నుండే పోర్టల్ ప్రారంభం..

రచ్చరేపుతున్న రెడ్‌బుక్ రాజకీయాలు..

ఏలూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 11 , 2024 | 09:10 AM

Advertising
Advertising