ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ABN, Publish Date - Oct 21 , 2024 | 09:44 AM

వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక బులెటిన్‌ మేరకు ఉత్తరాంధ్రలో ఈనెల 23 నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. కోస్తా, తమిళనాడుకు ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.

అమరావతి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. బుధవారం నాటికి అది తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ తుఫాన్‌పై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నాలుగు రోజుల ముందే ఒడిశా, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తూర్పుమధ్య బంగాళాఖాతంలోనే 22వ తేదీకి వాయుగుండంగా, 23 నాటికి తుఫాన్‌గా బలపడనుంది. తర్వాత వాయవ్యంగా పయనించి 24 నాటికి ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరం దిశగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అత్యధిక మోడళ్ల మేరకు తుఫాన్‌ బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి ఈనెల 25న ఒడిశాలోని గోపాలపూర్‌, పూరి మధ్య లేదా.. గోపాలపూర్‌, జగత్సింగ్‌పూర్‌ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.


వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక బులెటిన్‌ మేరకు ఉత్తరాంధ్రలో ఈనెల 23 నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. కోస్తా, తమిళనాడుకు ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అతని బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..

జగన్‌ తీరును తప్పుపడుతున్న నాయకులు

పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 21 , 2024 | 09:45 AM