ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పుంగనూరు ఘటనపై వైసీపీ రాజకీయాలు చేస్తోంది: హోంమంత్రి అనిత..

ABN, Publish Date - Oct 06 , 2024 | 08:55 PM

పుంగనూరులో బాలిక ఆస్పియా హత్య విషయాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఇలాంటి విషయాలనూ వారు రాజకీయాలకు వాడుకోవడం సిగ్గచేటని అన్నారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు, హత్యాచారాలు వంటి ఘటనల్లో నిందితులను ఉపేక్షించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పుంగనూరులో బాలిక ఆస్పియా హత్య చాలా దారుణమని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారని, ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని హోంమంత్రి తెలిపారు. చిన్నారి అదృశ్యమైందని ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు 12బృందాలుగా ఏర్పడి బాలిక కోసం గాలించారని చెప్పారు. దురదృష్టవశాత్తూ ఆస్పియా ప్రాణాలు కాపాడలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ విచారణ చేపట్టి మహిళ సహా ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆస్పియా హత్య విషయాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అనిత మండిపడ్డారు. ఇలాంటి విషయాలనూ వారు రాజకీయాలకు వాడుకోవడం సిగ్గచేటని అన్నారు. వైసీపీ హయాంలో వందలమందిపై అత్యాచారాలు జరిగాయని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో మాజీ సీఎం జగన్ ఒక్క రోజైనా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మాత్రం బాలిక హత్య కేసును వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిన్నారిపై అత్యాచారం జరగలేదని, ఆమె శరీరంపై చిన్న గాయం కూడా లేదన్నారు. ఈ విషయంలో పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని హోంమంత్రి అనిత చెప్పారు.

Updated Date - Oct 06 , 2024 | 08:55 PM