కేబినెట్ బెర్త్‌లపై ఆ ఎమ్మెల్యేల ఆశలు..
ABN, Publish Date - Jun 10 , 2024 | 08:48 AM
శ్రీకాకుళం: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. శ్రీకాకుళం జిల్లాలో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. దీంతో పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్త్‌లపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారు సామాజిక సమీకరణాలను బేరేజు వేసుకుంటున్నారు.
శ్రీకాకుళం: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. శ్రీకాకుళం జిల్లాలో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. దీంతో పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్త్‌లపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారు సామాజిక సమీకరణాలను బేరేజు వేసుకుంటున్నారు. గెలిచిన అందరూ సీనియర్లే కావడంతో ఎవరికివారు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. బీసీలు ఎక్కువగా ఉన్న జిల్లా వాసులు ఆది నుంచి పార్టీని ఆదరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేకపవనాలు వీచినా.. శ్రీకాకుళంలో మాత్రం పార్టీ తన ప్రాభవాన్ని నిలుపుకుంటూవస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినా ఉమ్మ డి శ్రీకాకుళం జిల్లాలో మాత్రం టీడీపీ రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కూటమి వైపు చూస్తున్న వైసీపీ కార్పొరేటర్లు
ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 10 , 2024 | 08:48 AM