Atmakuru: గురుకుల విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తున్న హాస్టల్ సిబ్బంది
ABN, Publish Date - Sep 29 , 2024 | 09:49 PM
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సిబ్బంది వెట్టిచాకిరి చేయిస్తున్నారు.
ఆత్మకూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సిబ్బంది వెట్టిచాకిరి చేయిస్తున్నారు. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో వంటతోపాటు, గదులు శుభ్రం చేయిస్తున్నారు. ఇదేంటని ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌ను ఏబీఎన్ ప్రశ్నించగా.. నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కారకులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే విద్యార్థులు చపాతీలు కాల్చడం ఆనవాయితీగా వస్తోందని.. అన్ని గురుకులాల్లో ఇలాగే ఉంటుందని.. సొసైటీ నుంచి తమకు ఆదేశాలున్నాయని సిబ్బంది చెప్పడం గమనార్హం.
Updated Date - Sep 29 , 2024 | 09:49 PM