ఇన్ఫోసిస్‌కు పెద్ద ఎదురుదెబ్బ..రూ.238 కోట్ల భారీ జరిమానా
ABN, Publish Date - Dec 02 , 2024 | 07:46 PM
ఇన్ఫోసిస్‌కు పెద్ద ఎదురుదెబ్బ..రూ.238 కోట్ల భారీ జరిమానా
భారత్ అతి పెద్ద టెక్ దిగ్గజం ఇన్పోసిస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇన్ఫోసిస్ చేసిన తప్పిదాలకు యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ రూ. 238 కోట్ల భారీ జరిమానా విధించింది. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను హెచ్ 1 వీ వీసాలకు బదులుగా.. వీ 1 సందర్శకుల వీసాలపై అమెరికాకు పంపుతోందని.. ఈ విధంగా వీసా, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విచారణ జరిపింది.
వీసా నిబంధనలు ఇన్పోసిస్ ఉల్లంఘించినట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విధించిన జరిమానా మొత్తం నగదును చెల్లించేందుకు ఇన్పోసిన్ సంస్థ అంగీకరించింది. ఇక భవిష్యత్తులో ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లింఘించ బోమని స్పష్టం చేసింది. వీసా తీసుకునే పద్దతుల్లో పారదర్శకతను పాటిస్తామని వెల్లడించింది. అయితే యూఎస్‌లో ఇప్పటి వరకు ఇమ్మిగ్రేషన్ చట్టం విధించిన కేసుల్లో ఇదే పెద్ద జరిమానా అని తెలుస్తుంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 02 , 2024 | 07:46 PM