హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్..
ABN, Publish Date - Sep 30 , 2024 | 10:36 AM
ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ నోటిఫై అయిన చెరువులకు సంబంధించిన ఫిర్యాదులపై హైడ్రా అధికారులు దృష్టి సారించనున్నారు. నిర్ధారిత ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
హైదరాబాద్: ఓ వైపు మూసీ ఆక్రమణల మార్కింగ్.. మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కూల్చివేత.. వాటిని వ్యతిరేకిస్తూ బాధితుల నుంచి నిరసనలు పెరిగిపోవటం, బాధితుల ఆక్రందనలు సోషల్ మీడియాలో వైరల్ కావటం.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు పునరాలోచనలో పడ్డాయి. క్షేత్రస్థాయి సర్వే, మార్కింగ్‌లను రెవెన్యూ విభాగం ఇప్పటికే నిలిపివేయగా.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోన్న ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్’ (హైడ్రా) తాత్కాలికంగా కూల్చివేతలకు విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విరామం సమయంలో ఫిర్యాదులపై సమగ్ర పరిశీలన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ నోటిఫై అయిన చెరువులకు సంబంధించిన ఫిర్యాదులపై దృష్టి సారించనున్నారు. నిర్ధారిత ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అదే సమయంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, స్థానిక మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల అనుమతులున్న నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రాల ఆమోదం అక్కర్లే: పీఎం మోదీ
బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’ నేడు
అందరికీ వరదసాయం అందాకే ఆ కార్యక్రమం
నువ్వు అవినీతిపరుడివి.. నువ్వే నిందితుడివి!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 30 , 2024 | 10:36 AM