హైడ్రా కూల్చివేతల్లో ఉపయోగించే భారీ యంత్రం ఇదే..
ABN, Publish Date - Sep 11 , 2024 | 03:33 PM
నగరంలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా హైడ్రా(HYDRA) కూల్చివేతలు సాగుతున్నాయి. అయితే ఈ కూల్చివేతల్లో హైడ్రాలిక్ జా క్రషర్ అనే యంత్రం ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది.
హైదరాబాద్: నగరంలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా హైడ్రా(HYDRA) కూల్చివేతలు సాగుతున్నాయి. అయితే ఈ కూల్చివేతల్లో హైడ్రాలిక్ జా క్రషర్ అనే యంత్రం ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది. దీన్నే హైడ్రా బాహుబలి అని కూడా అంటున్నారు. అత్యాధునికమైన టెక్నాలజీ పుణికిపుచ్చుకున్న ఈ యంత్రాలు దేశంలో కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి మన హైదరాబాద్ నగరంలో ఉంది. 20అంతస్తుల బిల్డింగ్‌ను సైతం తునాతునకలు చేయగల సత్తా ఈ హైడ్రాలిక్ జా క్రషర్‌కు ఉంది. సాధారణంగా భారీ భవనాలు కూల్చేందుకు 24 నుంచి 48గంటల వరకూ సమయం పడుతుంది. కానీ దీని సహాయంతో వాటిని కేవలం రెండు, మూడు గంటల్లోనే నేలమట్టం చేయవచ్చు. అంతటి భారీ శక్తి కలిగిన హైడ్రాలిక్ జా క్రషర్ ఎలాంటి టెక్నాలజీతో పని చేస్తోందో పైన ఉన్న వీడియోపై క్లిక్ చేసి తెలుసుకుందాం..
ఈ వార్తలు కూడా చదవండి..
గోదావరి మహోగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక..
అందుకే తేజస్వీతో సీఎం నితీశ్ భేటీ...
ఉచిత ఇసుక..నేటి నుండే పోర్టల్ ప్రారంభం..
రచ్చరేపుతున్న రెడ్‌బుక్ రాజకీయాలు..
Read LatestAP NewsandTelugu News
Read LatestTelangana NewsandNational News
Read LatestChitrajyothy NewsandSports News
Updated Date - Sep 11 , 2024 | 03:33 PM