ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AV Ranganath: ఇళ్ల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 28 , 2024 | 05:32 PM

జలవనరులన్నీ ప్రజల ఆస్తులేనని వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్: జలవనరులన్నీ ప్రజల ఆస్తులేనని వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురైన జలవనరులను కాపాడటమే హైడ్రా లక్ష్యమని అన్నారు. అక్రమ కట్టడాల వెనక కొందరు బలవంతులు ఉన్నారని రంగనాథ్ పేర్కొన్నారు.


"హైడ్రాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని కూల్చిన మళ్లీ కట్టారు. భవనంలో ఆసుపత్రి నడుపుతున్నట్లు ప్రచారం చేశారు. కానీ అందులో ఎవరూ లేరు. ఆక్రమణలు జరిపితే విడిచిపెట్టాలా. జలవనరులన్నీ ప్రజల ఆస్తులే. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అమీన్ పూర్‌లో వేలాది ఎకరాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. అక్కడ అనుమతులు రద్దు చేసినా నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు కట్టారు. ఆక్రమణలకు పాల్పడిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నాం. వరదలలో భవిష్యత్తులో కోటికిపైగా ప్రజలు ముంపు బారిన పడతారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఇళ్ల జోలికి వెళ్లట్లేదు. బుచ్చమ్మ అనే మహిళ ఇంటి జోలికి వెళ్లలేదు. ఆమె ఆత్మహత్యకు హైడ్రా కారణం కాదు. కొందరి తప్పుడు ప్రచారం వల్ల ఆమె సూసైడ్ చేసుకుంది' అని రంగనాథ్ పేర్కొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 05:55 PM