ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

ABN, Publish Date - Aug 14 , 2024 | 12:50 PM

హైదరాబాద్: తమ పర్యటన ఫ్లాప్ అయిందో, సక్సెస్ అయిందో ప్రజలకు తెలుసునని, ఎవరు ప్లాప్ అయ్యారో మొన్నటి ఎన్నికల్లో తెలిసిపోయిందని, బీఆర్ఎస్ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

హైదరాబాద్: తమ పర్యటన ఫ్లాప్ అయిందో, సక్సెస్ అయిందో ప్రజలకు తెలుసునని, ఎవరు ప్లాప్ అయ్యారో మొన్నటి ఎన్నికల్లో తెలిసిపోయిందని, బీఆర్ఎస్ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. తెలంగాణ (Telangana)లో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా (America), దక్షిణ కొరియా (South Korea) పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , బృందం తిరిగి బుధవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణ (Telangana as Future State) ఉండబోతుందని, మన రాష్ట్ర ఆలోచనను విదేశీ ప్రతినిధులకు చెప్పామన్నారు. దీంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను విదేశీ కంపెనీలు అభినందించాయన్నారు. తమ పర్యటనలో ఒక్క నిమిషం కూడా వృధాచేయకుండా ప్రతి నిమిషాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగించామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.


రాష్ట్రం కోసం కఠినమైన దీక్షతో పనిచేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం ముందుకు నడుస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఉత్సాహం చూపించారని, రెండు, మూడేళ్లలో రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ముందుకు పోతుందో మీరే చూస్తారని అన్నారు. కాగ్నిజెంట్‌తోపాటు ఇతర కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాగా విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న సీఏం రేవంత్ రెడ్డి బృందానికి కాంగ్రెస్ పార్ఠీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బ్యాండు, డప్పులు, డీజేలతో ఘన స్వాగతం పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు..?

జగనన్న లేఅవుట్లలో విజిలెన్స్ తనిఖీలు..

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేయాలి..

9 రాష్ట్రాల NSUI అధ్యక్షుల ప్రకటన

ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 14 , 2024 | 12:50 PM

Advertising
Advertising