జగన్ నిర్వాకం.. రైతుల కష్టాలు..
ABN, Publish Date - Dec 16 , 2024 | 11:01 AM
పాస్‌పుస్తకాల నిండా జగన్ పెద్ద పెద్ద ఫొటోలు.. సర్వే రాళ్లపైనా ఆయన బొమ్మలు.. ఏదో తన ఆస్తి ఉచితంగా ఇచ్చినట్టు.. రైతుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఆర్భాటం కోసం జగన్ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే రైతులకు ఇప్పుడు శాపంగా మారింది.
అమరావతి: జగన్ సర్కారు చేసిన పాపాలు రైతులకు శాపంగా, కూటమి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. నాడు నాలుగు దశల్లో 6,700 రెవెన్యూ గ్రామాల్లో అడ్డగోలుగా, హడావుడిగా చేసిన భూముల రీసర్వే ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టింది. రైతులు గతంలో లేని కొత్త సమస్యలు ఎదుర్కొంటుండగా, వాటిని సరిదిద్దడం కూటమి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. రుణాలు తీసుకోవడానికి, రీ షెడ్యూల్ చేయించుకోవడానికి రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.
పాస్‌పుస్తకాల నిండా జగన్ పెద్ద పెద్ద ఫొటోలు.. సర్వే రాళ్లపైనా ఆయన బొమ్మలు.. ఏదో తన ఆస్తి ఉచితంగా ఇచ్చినట్టు.. రైతుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఆర్భాటం కోసం జగన్ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే రైతులకు ఇప్పుడు శాపంగా మారింది. జగన్ చేసిన నిర్వాకానికి జనం అష్టకష్టాలు పడుతున్నారు. జగన్ ఫొటోల పిచ్చి కాసేపు పక్కన పెడితే.. రీ సర్వే అయినా సరిగా చేయించారా అంటే అదీ లేదు. వివాదాలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు. అంతా తప్పుల తడక. రికార్డులను గందరగోళం చేసేశారు. ఫలితంగా ఎంతోమంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేని దుస్థితి. అత్యవసరాలకు భూములను అమ్ముకోలేని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా 6700 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే చేశారు. రికార్డులు సరిగా లేని కారణంగా ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 54,000 రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయి. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. అటు రైతులకు సమస్యలు. ఇటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఖజానాకూ నష్టం.
ఈ వార్తలు కూడా చదవండి..
ABN Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..
జాకీర్ హుస్సేన్ మృతిపై చంద్రబాబు, లోకేష్ సంతాపం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 16 , 2024 | 11:01 AM