జగన్ బూమ్ బూమ్ రహస్యం...
ABN, Publish Date - Jul 25 , 2024 | 10:04 AM
అమరావతి: ముఖం చాటేయడం.. తప్పించుకుని తిరగడం.. దూరం జరగడం.. ఈ మూడు విషయాలను జాగ్రత్తగా గమనిస్తే ఒక లింక్ ఉంటుంది. తప్పు చేసినప్పుడు ముఖం చాటేస్తాం.. తప్పు చేసినప్పుడే తప్పించుకు తిరుగుతాం.. ఆ తప్పులో మన పని ఉంది అనుకున్నప్పుడు.. అక్కడి నుంచి దూరం జరుగుతాం.. ఇక్కడ ఆ మూడింటిలో కామన్‌గా ఉన్న లింకు..
అమరావతి: ముఖం చాటేయడం.. తప్పించుకుని తిరగడం.. దూరం జరగడం.. ఈ మూడు విషయాలను జాగ్రత్తగా గమనిస్తే ఒక లింక్ ఉంటుంది. తప్పు చేసినప్పుడు ముఖం చాటేస్తాం.. తప్పు చేసినప్పుడే తప్పించుకు తిరుగుతాం.. ఆ తప్పులో మన పని ఉంది అనుకున్నప్పుడు.. అక్కడి నుంచి దూరం జరుగుతాం.. ఇక్కడ ఆ మూడింటిలో కామన్‌గా ఉన్న లింకు.. తప్పు చేయడం అన్నప్పుడు.. ఆ తప్పు ఎక్కడ, ఎప్పుడు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అన్నప్పుడు అన్నీ వేళ్లు.. ఏపీ మాజీ సీఎం జగన్ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టే ముఖం చాటేస్తున్నారా? తప్పు చేశారు కాబట్టే దూరం జరుగుతున్నారా? తప్పు చేశారు కాబట్టే తప్పించుకుని తిరిగి హస్తినలో మకాం వేస్తున్నారా? అంటే ఎక్కువ శాతం అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న (బుధవారం) ఏపీ శాసనసభా సమావేశాల్లో ఐదేళ్ల జగన్ పాలనలో మద్యం కుంభకోణాలకు సంబంధించి కిక్ లెక్కలు తేలుస్తూ కూటమి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. దీనికి సంబంధించి అన్ని వివరాలు క్లియర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
ముడుపుల కిందే 3,113 కోట్లు నొక్కేశారు, ఖజానాకు మరో 18,860 వేల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ముడుపులు రూ. 3 వేల కోట్లు కావు.. రూ. 30 వేల కోట్లని బీజేపీ పేర్కొంది. జగన్ లిక్కర్ దందాపై పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదలైంది. అయితే ఒక రకంగా ఇది ఢిల్లీ స్కాంను మించిన మద్యం దందా.. జగన్ గత ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్వహించారన్నది బట్టబయలైంది. ఏడు కంపెనీలకే దాదాపు అన్ని ఆర్డర్లు ఇచ్చారు. ఇక్కడ ట్విట్టు ఏంటంటే.. దశలవారీగా మద్య నిషేదం అమలు చేస్తామని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తూ 38 కొత్త బ్రాండ్లు ప్రవేశపెడుతూ.. రేట్లు పెంచారు. డిస్టిలరీలను కబ్జా చేసి దందా చేశారు. తయారీ, అమ్మకం అంతా వాళ్ల చేతిల మీదగానే నడిచింది. అలాగే పక్క రాష్ర్టాల మద్యంతో ఎలా దోపిడీ చేశారో చంద్రబాబు శ్వేతపత్రంలో వివరించారు. ధరలు పెంచి పేదల జేబులు లూటీ చేశారు. నాసిరకం మద్యంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. రూ. వేల కోట్లు నష్టం చేస్తే శిక్షించకపోతే ఎలా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
‘‘మద్యపాన నిషేధం చేస్తామని 2019 ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే కొత్తగా 458 మద్యం షాపులను పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 840 బార్లలో ఒక్క దాన్ని కూడా తగ్గించలేదు. దోపిడీ కోసం ప్రత్యేకంగా మద్యం పాలసీ రూపొందించారు. ధరలు పెంచితే తాగేవారు తగ్గుతారని చెప్పి ఒకేసారి 75 శాతం రేట్లు పెంచారు. అక్రమాలను అరికడతామని ఎక్సైజ్ శాఖను విడగొట్టి సెబ్ ఏర్పాటుచేశారు. కానీ అసాధారణ స్థాయిలో ధరలు పెంచడం వల్ల పక్క రాష్ర్టాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డీపీఎల్) వస్తోందని సెబ్ అధికారులే రిపోర్టు ఇచ్చారు. గత ఐదేళ్లలో 1.78 కోట్ల అక్రమ మద్యం పట్టుబడింది. ఎన్‌డీపీఎల్ 66శాతం, మద్యం నేరాలు 64శాతం పెరిగాయి. వైసీపీ విధానాల వల్ల రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం పక్క రాష్ర్టాలకు వెళ్లింది. అయితే రాష్ట్రంలో ఆదాయం తగ్గడం వల్ల ఎవరికి మేలు జరిగింది, ఎవరి జేబులు నిండాయో తేలాల్సి ఉంది. 2014-19 మధ్య తెలంగాణతో పోలిస్తే ఏపీకి మద్యంపై ఆదాయం రూ.4186కోట్లు తగ్గింది. అదే 2019-24 మధ్య కాలంలో ఏకంగా రూ.42762 కోట్లు తగ్గిపోయింది. మొత్తంగా ఐదేళ్లలో ఏపీ ఖజానాకు రావాల్సిన ఆదాయంలో రూ.18860 కోట్ల నష్టం వచ్చింది. ఫలితంగా తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో ఆదాయం పెరిగింది’’
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు షాకిచ్చిన తిరుపతి కార్పొరేటర్లు..
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..
పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్’
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 25 , 2024 | 10:04 AM