ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lulu Mall: ఏపీకి పెట్టుబడుల వరద.. లులూ ఈజ్ బ్యాక్

ABN, Publish Date - Sep 29 , 2024 | 08:48 PM

దిగ్గజ పారిశ్రామిక సంస్థ లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ మళ్లీ రాష్ట్రంలో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో అతిభారీ షాపింగ్‌ మాల్‌ నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

అమరావతి: దిగ్గజ పారిశ్రామిక సంస్థ లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ మళ్లీ రాష్ట్రంలో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో అతిభారీ షాపింగ్‌ మాల్‌ నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో రూ. 2,200 కోట్ల పెట్టుబడితో విశాఖలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌, మెగా షాపింగ్‌ మాల్‌ వల్ల ఏడువేలమందికి ఉపాధి లభిస్తుందని నాటి ఒప్పందంలో పేర్కొన్నారు. దాంతో ఆ కంపెనీకి అప్పటి టీడీపీ ప్రభుత్వం 13.83 ఎకరాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం విశాఖలో లులూ సంస్థకు ఇచ్చిన భూముల లీజును రద్దు చేసేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు చేసుకున్న పారిశ్రామిక సంస్థల పట్ల వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర, కక్షపూరిత విధానాలకు పాల్పడటంతో అనేక పారిశ్రామిక సంస్థలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. తాజాగా చంద్రబాబు చొరవతో లులూ తిరిగి రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 29 , 2024 | 08:48 PM