సాయంత్రం అన్ని చెప్పేస్తా..: మనోజ్
ABN, Publish Date - Dec 11 , 2024 | 01:12 PM
హైదరాబాద్: మోహన్‌బాబు కుటుంబంలో రచ్చకెక్కిన ఇంటి గొడవలు మరింత ముదిరి తారస్థాయికి చేరాయి. బుధవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
Manchu Manoj : మంచు వారి ఇంట జరుగుతున్న రచ్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గడిచిన మూడు రోజులగా ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్ప.. ఏ కోశానా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. మంగళవారం నాడు జరిగిన గొడవకు కంటిన్యూగా.. బుధవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు బయట ఒక్కడివే ఉంటున్నామని, ఒక్కడివి చూసుకోలేవని, తల్లీ, తండ్రి అవసరం ఉంటుందని తనకు నాన్న స్నేహితులు సలహా ఇచ్చారని.. ఈ విషయంలో తన భార్య కూడా వారి మాటలు వినాలని చెప్పడంతో తాను తిరిగి తండ్రి ఇంటికి వచ్చానని మనోజ్ తెలిపారు.ఈరోజు తనపై చేసిన ఆరోపణలకు తాను సమాధానం చెప్పలేనని, ఆధారాలు మాత్రమే చూపిస్తానని అన్నారు. ఈరోజు సాయంత్రం అన్ని విషయాలు మీడియాకు వెళ్లడిస్తానని మంచు మనోజ్ చెప్పారు.
హైదరాబాద్: మోహన్‌బాబు కుటుంబంలో రచ్చకెక్కిన ఇంటి గొడవలు మరింత ముదిరి తారస్థాయికి చేరాయి. మోహన్‌బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ మధ్య చోటుచేసుకున్న వివాదం మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మనోజ్ బౌన్సర్లు, మోహన్‌బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్ దంపతులను మోహన్‌బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆయన గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఘర్షణను మరింత పెద్దది చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పేదలకు చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల
జగన్ పాపాలపై ఫిర్యాదుల వెల్లువ
శిక్షణ తరగతులను బహిష్కరించిన బీఆర్ఎస్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 11 , 2024 | 01:12 PM