ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి దంపతులు

ABN, Publish Date - Dec 13 , 2024 | 03:43 PM

Telangana: అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అయితే తొలత అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే షూటింగ్ క్యాన్సల్ చేసుకున్న చిరంజీవి.. బన్నీని కలిసేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని నిర్ణయించారు.

హైదరాబాద్, డిసెంబర్ 13: సంధ్యా థియేటర్ వద్ద తొక్కిలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌ను (Hero Allu Arjun Arrest) పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అర్జున్ అరెస్ట్‌ నేపథ్యంలో కుటుంబసభ్యులు బన్నీ అండగా నిలబడ్డారు. అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు (Chiranjeevi couple) అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అయితే తొలత అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే షూటింగ్ క్యాన్సల్ చేసుకున్న చిరంజీవి.. బన్నీని కలిసేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అయితే స్టేషన్‌కు రావొద్దని పోలీసులు స్పష్టం చేయడంతో చిరంజీవి, తన సతీమణి సురేఖతో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఆయన సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న దిల్ రాజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అలాగే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్‌ కూడా స్టేషన్‌ వద్దే ఉండి బన్నీకి ధైర్మం చెబుతున్నారు.

Updated Date - Dec 13 , 2024 | 03:44 PM