ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేటీఆర్‌పై మంత్రి కొండా సంచలన ఆరోపణలు..

ABN, Publish Date - Oct 02 , 2024 | 10:02 PM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సంచలన ఆరోపణలు చేశారు. కొందరు హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారని మంత్రి ఆరోపణలు గుప్పించారు.

హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సంచలన ఆరోపణలు చేశారు. కొందరు హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారని మంత్రి ఆరోపణలు గుప్పించారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేయడంతోపాటు ఆయన కూడా వినియోగించారని చెప్పారు. బాపూఘాట్‪లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియా మాట్లాడుతూ కేటీఆర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే ఆయనకు గౌరవం లేదంటూ విమర్శలు గుప్పించారు. వీలైనంత త్వరగా కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఆయనే ముఖ్య కారణమని చెప్పారు. కొంతమంది హీరోయిన్ల ప్రైవేటు సంభాషణలు రికార్డు చేసి వాటితో వారిని లోబర్చుకున్నారని తెలిపారు. తన మాట వినకపోతే రికార్డులు బయటపెడతానంటూ బెదిరించారని కొండ సురేఖ ఆరోపించారు. ఈ విషయం సినీ పరిశ్రమలో చాలామందికి తెలుసని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

Updated Date - Oct 02 , 2024 | 10:02 PM