ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేవంత్ అన్నకు మంచి పేరు తేవాలి: మంత్రి సీతక్క..

ABN, Publish Date - Oct 06 , 2024 | 08:38 PM

తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఉతీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఉతీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, లైబ్రేరియన్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్‌గా ఎంపికైన 1,473మందికి సీఎం రేవంత్, మంత్రులు నియామకపత్రాలు అందజేశారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించే ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా అంకితభావంతో పని చేయాలని, ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగం పొందామనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. అపాయిట్మెంట్ ఆర్డర్స్ పొందిన అంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. ద‌స‌రాకు ముందే మీ అందరికీ అతి పెద్ద పండ‌గ వచ్చిందన్నారు. ఇది మీ అంద‌రి జీవితాంతం గుర్తుండే సంద‌ర్భమని చెప్పారు. ఎన్నో ల‌క్ష్యాల‌తో చ‌దువుకుని నిబద్ధత, అంకితభావంతో ఉద్యోగాలు సాధించారని, అంతే కష్టపడి ఉద్యోగం చేయాలని కోరారు. ప‌ని చేసే చోట మీదైన మార్పు చూపాలన్నారు. మంచిగా ప‌ని చేసి రేవంత్ అన్నకు, ప్రజాపాలనకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 08:38 PM