ఏపీలో కొత్త మద్యం పాలసీ..
ABN, Publish Date - Sep 12 , 2024 | 08:12 AM
అమరావతి: అక్టోబరు 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది. వైసీపీ హయాం నుంచి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న లిక్కర్ షాపులు ఇకపై ప్రైవేటుపరం కానున్నాయి. దీంతో కూటమిలో హడావుడి పెరిగింది. లిక్కర్ లాబియింగ్‌కు నేతలు తెర తీశారా?
అమరావతి: అక్టోబరు 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది. వైసీపీ హయాం నుంచి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న లిక్కర్ షాపులు ఇకపై ప్రైవేటుపరం కానున్నాయి. దీంతో కూటమిలో హడావుడి పెరిగింది. లిక్కర్ లాబియింగ్‌కు నేతలు తెర తీశారా? వైన్ షాపులను దక్కించుకునేందుకు సిండికేట్‌గా మారి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం జరుగుతోందా? ఓ యువనేత బార్ ఓనర్స్‌తో నిర్వహించిన భేటీలో చేసిన డిమాండ్ ఏంటి? మామూలు దందాకు తెర తీశారనే టాక్ ఎందుకు వచ్చింది. ఇవ్వకపోతే ఎక్సైజ్ దాడులతో ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చారా?
కాగా నూతన మద్యం పాలసీని అక్టోబరు 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆరు రాష్ట్రాల్లో అధికారుల బృందాలు పర్యటించాయని, వాటిని పరిశీలించి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్నారు. కొత్త పాలసీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మొదటిభేటీ బుధవారం మంగళగిరిలోని సెబ్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధికారులు... మంత్రులకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ప్రభుత్వ షాపుల పాలసీ, ప్రైవేటు షాపుల పాలసీకి ఉన్న వ్యత్యాసాలపై చర్చించారు. రిటైల్ ట్రేడ్, మద్యం ధరలు, పన్నులపైనా ఆరా తీశారు. మరోసారి సమావేశమై లోతుగా అధ్యయనం చేయాలని ఉపసంఘం నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకినాడ వరద బాధితులకు చంద్రబాబు భరోసా
వారికి రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 12 , 2024 | 08:12 AM