ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..

ABN, Publish Date - Aug 08 , 2024 | 08:18 AM

విజయవాడ: ఏపీలో వైసీపీ ప్రభుత్వం రూ. 23 కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని ఏపీ క్యాబినేట్ నిర్ణయించింది.

విజయవాడ: ఏపీలో వైసీపీ ప్రభుత్వం రూ. 23 కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని ఏపీ క్యాబినేట్ నిర్ణయించింది. అలాగే ప్రజాధనం దుర్వినియోగం చేసి రూ. వందల కోట్ల ఖర్చుతో మాజీ సీఎం 75 లక్షల సర్వే రాళ్లపై తన ఫోటోలు వేసుకున్నారు. వాటిని పూర్తిగా ఆపాలని మంత్రవర్గం నిశ్చయించింది. ఇద్దరి కంటే ఎక్కుమంది ఎక్కువంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయండా అనర్హత వేటు నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.


అలాగే ప్రజాధనం దుర్వినియోగం చేసి కొన్ని రూ.వందల కోట్ల ఖర్చుతో నాటి సీఎం జగన్‌ 77 లక్షల సర్వే రాళ్లపై తన ఫొటోలు వేసుకున్నారు. వాటిని పూర్తిగా ఆపాలని మంత్రివర్గం నిశ్చయించింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు. ఇంకా జగన్‌ బొమ్మలు ఉన్న రాళ్లు ఉన్నాయని.. వాటిని వాడబోమని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ రికార్డులను, పాస్‌బుక్‌లను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రెవెన్యూ రికార్డుల తారుమారు, భూకబ్జాలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించి భూముల బదిలీలో జరిగిన మోసాలు, దోపిడీలు, కబ్జాలు గుర్తించి.. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు..

వినేశ్‌ విలాపం

చుక్కల భూములకు చెక్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 08 , 2024 | 08:54 AM

Advertising
Advertising