జగన్ పాపాలపై ఫిర్యాదుల వెల్లువ
ABN, Publish Date - Dec 11 , 2024 | 09:51 AM
అమరావతి: జగన్ జామానాలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని ప్రజలు గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇప్పటికే గ్రామసభలు నిర్వహించిన సర్కారు, ప్రజా ఫిర్యాదులను ఆర్టీజీఎస్ పరిధిలోకి తీసుకొస్తోంది.
అమరావతి: జగన్ జామానాలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని ప్రజలు గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇప్పటికే గ్రామసభలు నిర్వహించిన సర్కారు, ప్రజా ఫిర్యాదులను ఆర్టీజీఎస్ పరిధిలోకి తీసుకొస్తోంది. ప్రజల భూముల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఆరోతేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. వేల సంఖ్యలో ప్రజా విన్నపాలు ఈ సదస్సుల్లో వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సర్కారు బుధవారం నుంచి రెండు రోజులపాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. గత ఐదారు నెలలుగా కూటమి ప్రభుత్వానికి వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే ప్రధాన అజెండాగా సర్కారు కీలక చర్యలు చేపట్టబోతుంది. ఆ అంశాలను జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విన్నపానికి జవాబుదారీ కల్పించేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ రిడ్రెస్సెల్ గ్రీవెన్స్ సిస్టమ్‌ను (పీఆర్‌జీఎస్) ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీన్ని రియల్‌టైమ్ గవర్నెన్స్ సిస్టమ్‌తో (ఆర్‌టీజీఎస్) అనుసంధానించబోతున్నారు. ఆర్టీజీఎస్‌లో ఉండే డేటాను ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విభాగాధిపతులు ఎప్పుడైనా పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఆర్టీజీఎస్‌లోకి వస్తే ఏ సమస్య ఎలా పరిష్కరించారు....ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉంది....ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉంది...ఒక వేళ పరిష్కారం అయితే, సంబంధిత వ్యక్తి స్పందన ఎలా ఉందో నేరుగా ముఖ్యమంత్రి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రజాఫిర్యాదుల పరిష్కారంలో జవాబు దారీ కోసమే ఈ ప్రక్రియకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అధికారవర్గాలు చెబుతున్నా యి. కలెక్టర్ల సదస్సులో సీఎం ఇదే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం తమకోసం పనిచేస్తుందన్న సానుకూల దృక్పధం ఏర్పడేలా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, ప్రభుత్వానికి అందిన ప్రజా ఫిర్యాదుల్లో అత్యధిక శాతం రెవెన్యూశాఖ పరిష్కరించేవే ఉన్నాయి. అందులో ప్రధానమైనది భూముల సమస్య. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
శిక్షణ తరగతులను బహిష్కరించిన బీఆర్ఎస్
ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 11 , 2024 | 09:51 AM