బోరుగడ్డకు పోలీసుల రాచమర్యాదలు
ABN, Publish Date - Nov 07 , 2024 | 06:55 AM
రిమాండ్‌లో ఉన్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేశారు. రెస్టారెంట్‌కు తీసుకెళ్లి మటన్ బిర్యా నీకి ఆర్డర్ ఇచ్చారు. సెల్‌ఫోన్‌తో మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే క్రమంలో వైసీపీ నేత బోరుగడడ్డ అనిల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేశారు. గన్నవరం క్రాస్ రోడ్‌లో రెస్టారెంట్‌లో బోరుగడ్డకు పసందైన విందు భోజనం పెట్టారు. రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‌కు పోలీసులు కోరిన భోజనాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
రిమాండ్‌లో ఉన్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేశారు. రెస్టారెంట్‌కు తీసుకెళ్లి మటన్ బిర్యా నీకి ఆర్డర్ ఇచ్చారు. సెల్‌ఫోన్‌తో మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏడుగురు పోలీసులపై వేటు పడింది. గుంటూరులోని ఏఈఎల్సి చర్చి కోశాధికారి కర్లపూడి బాబు ప్రకాశ్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రిమాండ్‌పై అనిల్ రాజమహేంద్రవరం జైలులో ఉన్నాడు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు సంబంధించి కేసుల్లో తుళ్లూరు, తాడికొండ పోలీసులు పీటీ వారెంట్‌పై అతడిని బుధవారం మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. మంగళగిరి న్యాయస్థానం రెండు వారాల పాటు రిమాండ్ విధించింది.
కాగా ఇటీవల అనిల్‌ను జైలుకు తరలించే రెండు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ గతంలోలాగే రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో అనిల్ విషయంలో జాగ్రత్త వహించాలని గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎస్కార్ట్ పోలీసులను ముందస్తుగానే హెచ్చరించారు. అయినా ఎస్కార్ట్ పోలీసులకు తలకు ఎక్కలేదు. అనిల్‌ను మంగళగిరి కోర్టు నుంచి తిరిగి కేంద్ర కారాగారానికి తరలించే క్రమంలో పోలీసులు అతడికి రాచమర్యాదలు చేశారు. వాహనం గన్నవరం సమీపాన ఉన్న కేసరపల్లి వద్దకు వెళ్లేసరికి తనకు నాన్‌వెజ్ భోజనం కావాలని అనిల్ అడిగాడు. అక్కడున్న రెస్టారెంట్ వద్ద ఆపి మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. అంతకు ముందు పక్కకు వెళ్లి ఫోన్‌లో మాట్లాడుకునే వెసులుబాటు కల్పించారు. అనిల్ రెస్టారెంట్‌లో కూర్చుని భోజనం చేస్తుండగా, పోలీసులు పక్కన కూర్చున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 07 , 2024 | 06:57 AM