చిక్కుల్లో పీవీ సింధు.. అనుకోని కష్టం..
ABN, Publish Date - Oct 30 , 2024 | 12:40 PM
రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన పీవీ సింధూకు ఇప్పుడు అనుకోని కష్టం ఎదురైంది. అకాడమీ కోసం ప్రభుత్వం ఆమెకు కుటాయించిన స్థలంపై వివాదం చెలరేగింది. అక్కడ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని, సింధూకు మరో చోట స్థలం కేటాయించాలని కొందరు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ: దేశానికి ఒలింప్ పతకాలు తెచ్చిపెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ సీవీ సింధు ఇప్పుడు స్థల వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన పీవీ సింధూకు ఇప్పుడు అనుకోని కష్టం ఎదురైంది. అకాడమీ కోసం ప్రభుత్వం ఆమెకు కుటాయించిన స్థలంపై వివాదం చెలరేగింది. అక్కడ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని, సింధూకు మరో చోట స్థలం కేటాయించాలని కొందరు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిధూకు ఒలింపక్స్‌లో తొలుత వెండి పతకం వచ్చింది. తర్వాత ఆమె కాంస్య పతకం సాధించారు. భారత్ తరఫున బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా కూడా సింధు రికార్డులకెక్కారు. ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు. సింధు సేవలు బ్యాడ్మింటన్ క్రీడకు మరింతగా ఉపయోగపడాలంటే ఆమె ఒక అకాడమీ స్థాపించి యువ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని ఆలోచన వచ్చింది. ఏపీ ప్రభుత్వం వద్దకు ఈ ప్రతిపాదన వచ్చిందే తడవుగా స్థలం కేటాయింపు ప్రక్రియ అమలైంది. సీవీ సింధు అకాడమీ స్పోర్ట్సు స్కూల్ కోసం విశాఖలోని తోటగురువులో ఉచితంగా రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2021లో దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అకాడమీ అవసరాల కోసం ఆ భూమిని వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఎలాంటి వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించరాదని స్పష్టం చేసింది,
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం జగనే ఇసుక వ్యాపారం చేశారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
‘రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’
కేసులతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు..
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్
తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 30 , 2024 | 12:40 PM